సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తమిళ హీరో ధనుష్ – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ‘కుబేర’ నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాలతో వచ్చింది. మరి అంచనాలు నిజం చేసిందా?మరి సినిమా కధ విషయానికి వస్తే.. నీరజ్(జిమ్ సరబ్) పెద్ద బిజినెస్మె న్. ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అనిపిం చుకోవాలి… సెలబ్రిటీ స్టేటస్ కు అదనంగా పాటు రాజకీయ నాయకులఫై పట్టుసాధించి తన పవర్ పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకొంటాడు. అతడు ఒక భారీ గ్యాస్ ప్రాజెక్టు ను సాధించడానికి రాజకీయనాయకులు లక్ష కోట్లు డిమాండ్ చేస్తారు. అం దులో కొంత లిక్విడ్ క్యా ష్ గా.. మరి కొంత బ్లాక్ మనీగా ఇస్తారు. మిగిలిన యాభై వేల కోట్లను బినామీల పేరు మీదకి మార్చి వీళ్ళ కి అందేలా చేద్దామని చార్టెడ్ అకౌంటెంట్ దీపక్ (నాగార్జున) నీరజ్ కి సలహా ఇస్తాడు.అందుకోసం నలుగురు బిచ్చ గాళ్ళ ని ఎంపిక చేసుకుంటారు. వీరిలో దేవా(ధనుష్) కుష్బూ (దివ్య డేకటే) కూడా ఉంటారు.వాళ్ళ ని బినామీలుగా పెట్టుకుని డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఒక్కొ క్క రి అకౌం ట్ నుండి డబ్బు తమకు ట్రాన్సఫర్ చేసిన వెంటనే వారి చంపేయమంటాడు నీరజ్.. అందుకు దేవా అడ్డుపడతాడు. దీంతో దేవాని చంపేయాలని భావిస్తారు. అక్కడి నుండి కధ లో ట్విస్ట్ లు వెండితెరపై చూడాలి.. ఇక శేఖర్ కమ్ముల ఎప్పటిలానే సినిమా ఫలితం ఆశించకుండా విభిన్న కదంశం తో తనదయిన ధోరిణిలో క్లాసికల్ టచ్ తో సినిమా తీశారు. హీరో ధనుష్ కు జాతీయ అవార్డు ఖాయంగా కనిపిస్తుంది. బిచ్చగాడుగా జీవించాడు.. నాగార్జున క్లాస్ గా నటించాడు. విలన్ గా జిమ్సరబ్ కూడా చాలా బాగా సైకో తరహాలో చేశాడు. కుబేర’ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది. ఒక్కోక్యారెక్టర్ పరిచయం, బాగుంది. ఇక సెకండాఫ్ మంచి సన్నివేశాలు మంచి డైలాగ్స్ ఉన్నపటికీ సాగదీతగా ఉంటుంది. లొకేషన్స్ అన్నీ నేచురల్ గానే ఉన్నాయి. నిర్మాతలు కథకికావలసిన రిచ్ గా సినిమా తీశారు. నికేత్ బొమ్మి రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో సరికొత్త బాణీలతో ప్రాణం పోసాడు. సినిమా నిడివి 3గంటల పైనే ఉంది. ప్రేక్షకులు కాస్త ప్రశాంతంగా చుస్తే మంచి పిల్ ఉంటుంది.
