సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లో ఇటీవల చదువు కొంటున్న యువతులపై దాడులు, అత్యాచారాలు, అగ్ని కి ఆహుతి చేస్తున్న ఘటనలు అంతులేకుండా పోతున్నాయి. ఈ సైకో లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజగా నంద్యాల జిల్లా, నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో ఇంట్లో నిద్రిస్తున్న ఇంటర్ విద్యార్థినిపై ఒక సైకో ప్రేమికుడు పెట్రోల్ దాడి ఘటన సంచలనం సృష్టించింది. పేద కుటుంబంలో పుట్టి తండ్రి లేకపోయిన తన తల్లిని ఆదుకోవాలని జీవితంపై ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థిని లహరి (17) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్ర అనే యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ చిట్టితల్లి లహరి మంటల్లో కాలి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రేమోన్మాదిలో కూడా మంటలతో వంటికి గాయాలు కావడంతో హాస్పటల్ లో చేరాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు చేప్టటారు. గత అక్టోబర్ 20న ఇదే తరహా దారుణం జరిగింది. జూనియర్ ఇంటర్ చదువుతున్న బాలికపై స్నేహితుడి ముసుగులో ఉన్న వ్యక్తి కలవడానికి రమ్మని చెప్పి..ఆమె ఫై మానభంగానికి ప్రయత్నించి విఫలం కావడంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.చాల దారుణంగా చెయ్యని తప్పుకు ఆమెమరణించింది.
