సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రామచంద్ర పురం సీటు వచ్చే ఎన్నికలలో తన కుమారుడికి కేటయించకపోతే తాను ఇండిపెండెంట్ గా వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించిన వైసిపి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబాబు నేడు, మంగళవారం సాయంత్రం మీడియా సమావేసంలో పార్టీ అధినేత సీఎం జగన్ కు క్షమాపణలు తెలిపారు, తాను ఆలా మాట్లాడి ఉండవలసింది కాదని విచారం వ్యక్తం చేసారు. రామచంద్రాపురంలో నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు అవమానం జరుగుతున్నా విషయం సీఎం జగన్ దృష్టికి తీసుకొనివెళ్ళాను, ఆయన దానిపై విచారణ చేయించి చర్యలు తీసుకొంటానని అన్నారు,తాను టీడీపీ, జనసేన పార్టీలలో చేరుబోతున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు బోస్ తెలిపారు. రామచంద్రాపురంలో అభ్యర్థి ఎవరో సీఎం జగన్ ఒక ప్రత్యక సర్వే చేసి నిర్ణయిస్తారని, వైసిపి పార్టీ నిర్మాణంలో తాను కూడా ఒక పిల్లర్‌ను అని , తనకు పార్టీ మారవలసిన అవసరం ఏమిటి? అని బోస్ అన్నారు.
