సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యువగళం పాదయాత్ర లో భాగంగా నిన్న భీమవరం పట్టణం ఉద్రిక్తల తో అట్టుడికిపోయింది. వైసీపీ ఫ్లేక్సీ లు చింపడం మరల వైసిపి వాళ్ళు కొత్తవి కట్టడం తదుపరి లోకేష్ పాదయాత్ర సమయంలో వాటిపై లోకేష్ తన కూడా తెచ్చుకొన్న ప్రత్యేక రెడ్ చొక్కాలు వేసుకొన్న వాలంటీర్లు పబ్లిక్ గా అందరు చూస్తుండగా రాళ్ళూ రువ్వడం , పోలీసులతో వాగ్వాదం, త్రోపులాట .. తదుపరి ప్రకాశం చౌక్ లో బహిరంగ సభలో సీఎం జగన్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫై లోకేష్ బాబు దూషణలు పర్వం.. లోకేష్ ఉచ్చరించడంతో ఆయనతో పాటు వేదికపై ఉన్న టీడీపీ పెద్దలు( వీరికి రాజకీయాలకు అతీతంగా పట్టణంలో గౌరవ స్థానం ఉంది..) కూడా కొంత కలవరానికి గురి అయ్యారు. ఈలోగా నియోజకవర్గంలో వైసిపి శ్రేణులు అట్టుడికి పోయాయి. గత రాత్రి గునుపూడి మీదుగా తాడేరు మీదుగా పాదయాత్రగా వెళుతున్న లోకేష్ ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వైసిపి శ్రేణులు జెండాలతో నిరసన తెలపడంతో ఇరు వర్గాల ఉద్రిక్తత మొదలయి రాళ్ళూ విసురుకోవడం జరిగింది. ఇరువర్గాలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి చెదరకొట్టారు. ఈ గందర గోళంలో లోకేష్ కు గాయాలు కాకుండా పోలీస్ లు వలయంగా నిలబడి రేకులు అడ్డు పెట్టి రక్షణ కలిపించారు. ఈ బాహాబాహీ లో టీడీపీ వైసిపి కార్యకర్తలతో పాటు పలువురు పోలీసులు కు తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తాలు కారాయి. తదుపరి పోలీసులు వీడియో ఫుటేజ్ ఆధారాలతో గలాటా చేసినవారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం మొదలు పెట్టారు. గత రాత్రి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గునుపూడి ప్రాంతానికి రాత్రి వెళ్లి గాయాలు పాలయిన బాధితులను పరామర్శించారు. ఉండి TDP మాజీ ఎమ్మెల్యే శివరామ రాజు దాడిలో గాయం అయ్యిందని భీమవరం ఆసుపత్రిలో చేరటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *