సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేషన్ బియ్యం కుంభకోణం కేసులో ప్రభుత్వం పేర్ని జయసుధ ఫై పెట్టిన కేసులో అరెస్ట్ నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో .. ఒక ప్రక్క వైసీపీ లో హర్షం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఊహించని విధంగా నేడు, మంగళవారం వైఎస్సార్‌సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani)పై కేసు నమోదు అయింది. ఈ కేసులో కీలక నిందితుడుగా పేర్ని నానిని పోలీసులు ఏ-6 (A-6)గా నమోదు చేశారు. కృష్ణా జిల్లా, బందరు తాలుక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీనితో ఇప్పుడు పేర్ని నానీని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు తనపై కేసు నమోదు చేశారని తెలియడంతో పేర్ని నాని వెంటనే ఏపీ హైకోర్టులో పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ వేశారు. దీనిపై నేడు మంగళవారం మధ్యాహ్నం వరకు విచారణ జరిగింది. సోమవారం (జనవరి6) వరకు ఎటువంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.
