సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుంది. .. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.మరో 2 రోజులు పాటు భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.రేపు మంగళవారం భారీ వర్షాలు కురిసే ప్రాంతాల వివరాలు; కోస్తా ఆంధ్ర, ముఖ్యంగా కోనసీమ, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
