సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మండు వేసవిలో నిన్నటి నుండి గోదావరి జిల్లాల్లో కుండపోత వానలతో వణికించిన వర్షాలు ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ (Red Alert ) చేసింది. సోమ, మంగళవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ గోదావరి లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో ప్రక్క 40-43 డిగ్రీల తీవ్రమైన ఎండలతో పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే గంటకు 80 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
