సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పవిత్ర రామాయణం నేపథ్యంలో.. భీమవరం బ్రాండ్, పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ హీరోగా మరో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్. ఈ సినిమా తెలుగు హక్కులు హోల్ సేల్ గా భారీ రేట్లకు అమ్ముడుపోయాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 200 కోట్ల షేర్ రాబట్టాలంటే.. 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు కళ్ల చూడాల్సి వుంది. అయితే ఇటీవల సరైన భారీ సినిమా లేక కళ తప్పిన సినిమా థియేటర్లు అన్నీ ‘ఆదిపురుష్ 3D’ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. . అందువల్ల ఎగ్జిబిటర్ అడ్వాన్స్ లకు పెద్దగా సమస్య కాదు. ఇక జగన్ సర్కార్ 100 కోట్ల పైబడి నిర్మించే సినిమాలకు టికెట్ ధర కొద్దీ మొత్తంలో పెంచుకొనే అవకాశం ఉండటంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మాగ్జిమమ్ థియేటర్లలో ఆదిపురుష్ ను విడుదల చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోంది. అలాగే 50 రూపాయల అదనపు రేటు కూడా దాదాపు వచ్చినట్లే. ఆంధ్ర ప్రభుత్వం వైపు నుంచి సూత్ర ప్రాయంగా అంగీకారం వచ్చింది. జీవో రావాల్సి వుంది. వీలయినన్ని థియేటర్లలో, అదనపు రేట్లతో ప్రదర్శించడం ద్వారా మొదటి మూడు రోజుల్లో మాగ్జిమమ్ వసూళ్లు రాబట్టడం అన్నది ప్లానింగ్ గా కనిపిస్తోంది. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ వ్యూహాలు అన్నీ ఫలించి, వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టే అవకాశం వుంది.అంత ఒక ఎత్తు.. మరి భీమవరంలో ప్రభాస్ అభిమానులు ఒక రేంజ్ లో ఆదిపురుష్ విడుదల ఏర్పాటు చేస్తున్నారు మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *