సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: క్రీడలు మానసిక ఉల్లాసానికి అందిస్తాయని, ప్రతిభావంతులను ప్రతిఒక్కరూ ప్రోత్సహించాలని, మలేసియా లో జరిగిన ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మన భీమవరం విద్యార్థిని ప్రతిభ కనబరచడం మన రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఇటీవలే మలేషియాలోని కౌలాలాంపూర్ లో జరిగిన 3వ ఎంఎంఎఫ్ మినిమ్ ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్ – 24 అండర్ -12 బాలికల ఈపి ఈవెంట్లో భీమవరం వెస్ట్ బెర్రీ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని మంతెన ధృతి సమీక్ష ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విద్యార్థిని ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు.అలాగే విద్యార్థిని సమీక్ష భీమవరంలోని కేఎం ఫెన్సింగ్ క్లబ్ లో నాలుగేళ్లుగా శిక్షణా పొంది తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుందని ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు.
