సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని ‘వీర సింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరల ఓ భారీ యాక్షన్ సినిమా కి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు, ఆదివారం పోస్టర్ రూపంలో విడుదల చేశారు. గోపీచంద్ మలినేని మాటలలో .. ‘నందమూరి బాలకృష్ణ గారితో తిరిగి కలవడం గౌరవం గా ఉంది. మహాదేవుడు తిరిగి వచ్చాడు.. ఈసారి మనం బిగ్గరగా గర్జిస్తున్నాం’ అంటూ తెలిపారు. ఈ ప్రజంట్ పోస్ట్ వైరల్అవుతుంది. ఇక బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో అభిమానులు ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నా అఖండ 2 సినిమా టీజర్ రేపు సోమవారం సాయంత్రం 6 గంటలకు సోషల్ మీడియాలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక బాలయ్య అభిమానులకు ఫుల్ జోష్ అన్నమాట..
