సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జగనన్న గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని, టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందజేయాలని కోరుతూ నేడు గురువారం విజయవాడలో సీపీఐ చేపట్టిన మహాధర్నాకు సీపీఐ శ్రేణులను వెళ్ళనీయకుండా జిల్లాలో పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆరోపించారు. పోలీసులు గత బుధవారం నుంచే సీపీఐ ధర్నాకు విజయవాడ వెళ్ళరాదంటూ ముందస్తు నోటీసులు జారీ చేశారన్నారు. తనకు కూడా గత బుధవారం రాత్రి పదిన్నర గంటలకు గునుపూడిలోని తన నివాసంలో.. విజయవాడ సీపీఐ ధర్నా కు వెళ్ళరాదంటూ భీమవరం ఒన్ టౌన్ పోలీసులు ముందస్తు నోటీసు ఇచ్చారన్నారు. ప్రజాసమస్యలపై ఉద్యమించే హక్కును కాలరాచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నిఅపహాస్యం చేస్తుందన్నారు. నిర్భంధాలు, అక్రమ అరెస్టులతో ప్రజా పోరాటాలను అణచివేయాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అవివేకమని విమర్శించారు.
