సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకుచేరుకొంది. ఈ షో ప్రారంభం నుండి విన్నర్ అవార్డు తనూజకి కట్టబెట్టే ఆలోచనలో నిర్వాహకులు, షో హోస్ట్ నాగార్జున ఉన్నట్లు షో ముందు నుండి చూస్తున్న ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది. సుమారు 40 ఏళ్ళు ఉన్న తనూజ మాటలతో చిన్న పిల్లలా నటిస్తూ. భరణిని నాన్న అని లొంగదీసుకుని .. ఇతరులపై తన దుఖఃము.. నోటి దురుసుతో ఎదురుదాడి చేస్తుంది. ఇటువంటి యువతికి పెద్ద పాస్ పాలోయింగ్ ఉన్నట్లు.. కొందరు భజన టీమ్ తో బిగ్ బాస్ నిర్వాహకులు ఇస్తున్న కలరింగ్ ప్రమోషన్ అవకాశాలు, కల్పిస్తూనే ఉన్నారు. నిజాయితీగా గేమ్ ఆడినవారిని తనూజ కు అడ్డు వచ్చేవారిని హౌస్ నుండి ప్యూహాత్మకంగా తొలగిస్తున్న పద్దతి? ఓటింగ్ పేరుతొ ప్రేక్షకులను బకరాలను చెయ్యడం ఎందుకు? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఏ మాత్రం సహనం లేని తనూజ, ప్రతి కదలిక మోసం , అందరి సహాయం పొందటమే తప్ప తాను ఎవరికీ కృతజ్ఞత చూపని తత్వం .. తనకు ఎవరు సహాయం లేకుండానే తాను టాప్ 5 కి వచ్చేసానన్న పబ్లిక్ గా చెప్పుకొనే తెగింపు.( నిజమే ఆమెకు బిగ్ బాస్ భరోసా వుందా ?). ఆమె ‘అతి ప్రవర్తన’ గంట సేపు బిగ్ బాస్ షో లో చూస్తేనే భరించలేము.. మరి హౌస్ లో ఇన్ని రోజులు పిచ్చ ఎక్కకుండా భరించిన హోసే మేట్స్ కు నిజంగా సహనానికి సెల్యూట్ చెయ్యాలి. ఇటువంటిమహానటి’ తనూజ ను టాప్ 5 వరకు తీసుకొనిరావడమే పెద్ద తప్పు.. ఆమెకు కు విన్నర్ అవార్డు ఇస్తే మాత్రం బిగ్ బాస్ మానవ విలువలకు, సంబంధాలకు కొత్త సంకేతం ఇస్తున్నట్లే.. గతంలో . డెమాన్ పవన్ తో , రీతూ చౌదరి, తోండి చేష్టలు కూడా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన .. ఆమె బయటకు వెళ్లడంతో రిలీఫ్ దొరికింది.ఇక ఇమ్మానుయేల్ ఆటకు కామెడీకి, ప్లానింగ్ కు తిరుగులేదు.నిజానికి ఇతడే టాప్ 2గారావడానికి అర్హత సాధించినప్పటికీ తనూజా బాధ చూడలేక బిగ్ బాస్ .. మరో బోనస్ గేమ్ పెట్టి ఆమెను టాప్ 2 గా ఒడ్డుకు చేర్చడం ఏమిటి? ఇకభరణి, సుమన్ శెట్టి జంట మంచి విలువలతో, బాండింగ్ తోకొనసాగింది. వారిద్దరిని ఒకేసారి బయటకు తీసుకొనివచ్చి బిగ్ బాస్ మంచి పని చేసారు. అటువంటి వ్యక్తులు తనూజ లాంటి వ్యక్తి ని విన్నర్ చెయ్యడానికి సహాయం చేసే పరిస్థితి రావడం కన్నా హౌస్ నుండి బయటకు రావడమే మంచి పద్ధతి.ఇక టాప్ వన్ గా ఉన్న కళ్యాణ్ సమర్థుడే.. కానీ అతనిని కూడా తనూజ తన ప్యూహం లో బందించి వాడేసుకొనే వదిలేసే అవకాశం స్వష్టం గా కనిపిస్తుంది. మొత్తంగా చుస్తే ఈ బిగ్ బాస్ సీజన్ చాల బెస్ట్ .. అయితే తనూజ ఒక దిష్టి చుక్క
