సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కడప వేదికగా 3 రోజుల మహానాడు మొన్న ప్రారంభమైంది. నేటి తో అంటే మే 29వ తేదీతో ముగియనుంది. ఎటువంటి ఉద్రిక్తతలకు తావులేకుండా కడపలో మహానాడు విజయవంతంగా పూర్తీ అవుతుంది. గత 2 రోజులు తో పోలిస్తే నేడు, వేలాది వాహనాలలో టీడీపీ కార్యకర్తలు కడప కు తరలివచ్చారు. నారా లోకేష్ ను పార్టీ అడ్జక్షుడుగా ప్రకటిస్తారని పలువురు భావించినప్పటికీ ఆ ప్రకటన రాలేదు. నేటి సాయంత్రం సీఎం చంద్రబాబు కడప నుండి రాజధాని అమరావతికి చేరుకుంటారు. వారం తిరగకుండానే మరోసారి అయన ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు శుక్రవారం న్యూఢిల్లీలోని తాజ్ హోటల్‌లో జరగనున్న సీఐఐ ఏజీఏం సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. రేపు శుక్రవారం సాయంత్రం 4. 30 గంటల నుంచి 5. 30 గంటల మధ్య ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.రేపటి రాత్రి ఢిల్లీలోనే ఆయన బస చేయనున్నారు. ఇక శనివారం ఉదయం 10.00 గంటలకు న్యూఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్‌కు ఆయన చేరుకొని తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు.
