సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు వారు గర్వించే జాతీయ స్థాయి , అగ్రనేత , కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి కి దేశవ్యాప్తంగా ఘన నివాళ్లు అర్పిస్తున్న నేపథ్యంలో భీమవరం లోని జిల్లా సిపిఎం కార్యాలయంలో నేడు, శుక్రవారం ఉదయం ఆయన ఫొటో కు పూల దండాలు వేసి వందలాదిగా కార్మిక సోదరులు ఘన నివాళ్లు అర్పించారు. భీమవరంలో పలు సార్లు రాష్ట్ర సిపిఎం మహాసభలకు హాజరు అయిన ఆ మహానేత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొన్నారు. వక్తలు మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గుర్తింపు పొందిన నేత అంతర్జాతీయ విషయాలపై పట్టువున్న నేత సీతారామ్ ఏచూరి అని కొనియాడారు. పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన వామపక్ష మేధావి, మత ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకోరాదని పోరాడినాడని సెక్యులర్ భావాల వ్యాప్తికి 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిరంతరం కృషి చేసినారని తెలిపారు. విద్యార్థి ఉద్యమ నేతగా 12 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యునిగా, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కృషి చేసిన సీతారాం ఏచూరి మరణం పట్ల సంతాపం తెలియజేశారు. ప్రముఖ రచయితగా, జర్నలిస్టుగా కృషి చేస్తూ క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, సోషలిజమ్ ఇన్ చేంజింగ్ వరల్డ్ ,కమ్యూనిజమ్ వర్సెస్ సెక్యులరిజం లాంటి పుస్తకాలు రచించారని తెలిపారు .
