సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను వణికిస్తున్న మాండూస్ తుఫాన్ తీరం దాటింది. నేటి శనివారం తెల్లవారు జాము 2గంటల ప్రాంతంలో పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది. అయితే నేటి శనివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర తీరా ప్రాంతంతో పాటు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. రేపు ఆదివారం చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. పశ్చిమ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలోని సముద్ర తీరా ప్రాంతాలలో ఇప్పటికే మత్యకారులు అందరు తిరిగి వచ్చేశారని, సముద్రం అల్లకల్లోలంగా ఉండి ముందుకు వచ్చిందని అధికారులు తెలియజేసారు.
