సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం .. తెలుగు వారికే కాదు ప్రపంచ సినీ పరిశ్రమ కృష్ణ లాంటి ఒక బాహుబలి ని కోల్పోయింది. తెలుగు సినీ లెజెండ్ .. 80 వసంతాలు పూర్తీ చేసుకొన్నా మంచి మనిషి.. సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు విదేశాలలోని తెలుగు వారిని భారతీయ సినీ పరిశ్రమను కదిలించింది. ఇప్పటికి కొనసాగుతున్న కృష్ణ అభిమానులు, (మహేష్ అభిమానులు) 2500 అభిమాన సంఘాలతో వీరాభిమానులు ను సంపాదించుకొన్న ఏకైక హీరో కృష్ణ మాత్రమే.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ హీరో , ఏ సినీ ప్రముఖుడు సాధించని అద్భుతాలు ఎన్నో చేసిన వ్యక్తి కాదు సినీ హీరోగా అద్భుతమైన స్టార్ డమ్ అనుభవించిన హీరో కృష్ణ , నిర్మాతగా, దర్శకుడుగా, స్టూడియో అధినేతగా, థియేటర్స్ నిర్వాహకుడిగా, సినిమా డిస్ట్రిబ్యూటర్స్ గా, హిందీ సినిమాలు దక్షిణా భారతంలో విడుదల చేసే డిస్ట్రిబ్యూటర్లుగా, భారతీయ టివి సీరియల్స్ లో సైతం నిర్మాతగా, హీరోగా , ఇంకా రాజకీయాలలో తన అభిమాన హీరో ఎన్టీఆర్ ను ఢీ కొట్టిన సాహసి కృష్ణ. ఏలూరు లోక్ సభకు ఎంపీగా ఎన్నికయి .. ఇలా అందులేడు .. ఇందులేడు అన్నరీతిలో సాహసానికి చిరునామాగా మారిపోయారు సూపర్ స్టార్ కృష్ణ.. భారతీయ సినిమా పరిశ్రమకు పాన్ ఇండియా వ్యాపార సూత్రాలు నేర్పిన తెలుగు ఘనుడు కృష్ణ మాత్రమే.. ఎప్పుడో 50 ఏళ్ళ క్రితమే మోసగాళ్లకు మోసగాడు ,40 ఏళ్ళ క్రితమే కురుక్షేత్రం, 36 ఏళ్ళ క్రితమే హీరో కృష్ణ డ్యూయల్ రోల్, ఎడిటింగ్, కధ , కధనం, నిర్మాత, దర్శకుడిగా భారీ సెటింగ్స్, 6ట్రాక్ స్టీరియో పోనిక్ సిస్టం, 70 ఎం ఎం లో నిర్మించిన సింహాసనం సినిమాలు భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక బాషలలో ప్రభంజనంలా రిలీజ్ అయ్యి భారీ హిట్స్ సాధించాయి. మోసగాళ్లకు మోసగాడు ఇంగ్లిష్ లో ‘ట్రెజరర్ హంట్’ పేరుతొ హాలీవుడ్ సినిమాగా దాదాపు 60 విదేశాలలో ప్రదర్శింపబడింది. జాతీయ స్థాయిలోనే కాదు.. మాస్కో రష్యా ఫిల్మ్ పెస్టివెల్ అవార్డు అందుకొన్న తోలి భారతీయ సినిమా స్కోప్ .. అల్లూరి సీతారామరాజు, ఆ సినిమా టేకింగ్, నిర్మాణ స్థాయి చుస్తే ఇప్పటికి మతిపోతుంది. నిజానికి ఈ సినిమాలు 3 ఏళ్ళు పాటు తియ్యలేదు . కేవలం 2 నెలలు లో నిర్మించిన చిత్రాలు అంటే ఎవ్వరు నమ్మరు. కృష్ణ .. కురుక్షేత్రం కర్ణాటకలో డబ్బింగ్ చెయ్యకుండానే అక్కడ 15సెంటర్స్ లో 100 రోజులు ఆడిన పాన్ ఇండియా దిగ్గజం.. కృష్ణ నిర్మాతగా పద్మాలయ బ్యానర్ ఫై హిందీలో అగ్రగామి నిర్మాణ సంస్థ..జితేంద్ర , ధర్మేంద్ర, అమితాబ్ లతో ఎన్నో సినిమాలు నిర్మించారు. పాతాళ బైరవి, హిమ్మత్ వాలా , మవాలి, సూర్యవంశ్ వంటి ఎన్నో బంపర్ హిట్స్ నిర్మించారు. ముంబై లో పద్మాలయా కృష్ణ ను కలవాలంటే హిందీ ప్రముఖులు 7 రోజులు ముందు అపాయింట్మెంట్ తీసుకోవలసిన రోజులు అవి..350 చిత్రాలలో హీరోగా నటించిన ఏకైక భారతీయ సినీ హీరో కృష్ణ. ఇక తెలుగు స్వతంత్ర వీరుడు, పోరాట యోధుడు అల్లూరి సీతారామ రాజు సినిమా తో అల్లూరి ఇలా ఉంటాడు.. అని భావి తరాలకు గుర్తుండిపోయేలా రామరాజు పాత్రలో లీనమై ప్రాణప్రతిష్ట చేసిన లెజెండ్ సినీ హీరో ..మహాభారతంలో లేనిది ఎక్కడ ఉండదు.. మరి కృష్ణ చేయలేనిది మరెవరైనా చెయ్యగలరా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *