సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహారాష్ట్ర ఎన్నికల్లో నేటి శనివారం ఓట్ల కౌంటింగ్ లో ఎన్డీయే కూటమి ఘనవిజయం దిశగా దూసుకొని పోతుంది. నేటి మధ్యాహ్నం సమాచారం ప్రకారం మొత్తం 288 స్థానాలకు 230 స్థానాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థులు విజయం వైపు దూసుకొని పోతుంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కేవలం 55 స్థానాలలో విజయం దిశగా నడుస్తుంది. ఇటీవల లోక్ సభ ఎన్నికలలో ఇండియా కూటమి ప్రబంజనం కేవలం 5 నెలలలో మహారాష్ట్రలో మటుమాయం కావడం గమనార్హం.. మహిళా ఓటర్లు, మరాఠాలు, ఓబీసీలు కులాల ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మహాయుతి హామీ ఇచ్చిన ఉచిత పథకాలు కూడా ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థం అవుతోంది.ఇక వృద్ధాప్య పెన్షన్ రూ.15 వందల నుంచి రూ. 2వేల 100కి పెంచుతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. మహారాష్ట్రలో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది బీజేపీ కూటమి.
