సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల చివరి అంకం లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇటీవల ఢిల్లీ లో హోం మంత్రి అమిత్ షాను కలసిన సమయం లో మహారాష్ట్ర లో తెలుగు వారు ఎక్కువ ఉన్న పలు ప్రాంతాలలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వలసిందిగా జన సీనానిని కోరారు. దీంతో పవన్ తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఖరారు చేసుకున్నారు మహారాష్ట్ర లో ఔరంగాబాద్, షోలాపూర్ తదితర ప్రాంతాలలో ఈ నెల 16,17 తేదీల్లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయనున్నారు పవన్ కళ్యాణ్.
