సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముంబయిలో నేడు, శుక్రవారం మెగా హీరో రామ్‌ చరణ్‌ , ఆయన సతీమణి ఉపాసన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ను కలిశారు. ముంబయిలోని తన నివాసానికి వచ్చిన రామ్‌చరణ్‌ దంపతులకు సీఎం సాదర స్వాగతం పలికారు. సీఎంతో కలిసిన ఫొటోను ఉపాసన తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘మీ అసాధారణమైన ఆతిథ్యం, ఆప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొంటూ ఆమె ట్వీట్‌ చేశారు.మరోవైపు, ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను సీఎం ఏక్‌నాథ్‌ శిందే సైతం తన సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకున్నారు. రామ్‌చరణ్‌, ఉపాసనతో సమావేశం బాగా జరిగిందని పేర్కొన్నారు. తమ ఇంటికి వచ్చిన రామ్‌చరణ్‌ దంపతులకు పుష్పగుచ్ఛంతో పాటు వినాయకుడి విగ్రహాన్ని ఇచ్చి ఆహ్వానించినట్లు శిందే తెలిపారు. సినీ రంగంతో పాటు పలు అంశాలపై తమ మధ్య సానుకూల చర్చలు జరిగాయన్నారు. ఈ భేటీలో శిందే తనయుడు, ఎంపీ శ్రీకాంత్‌ శిందే, ఆయన సతీమణి వృశాలి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *