సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం తాడేపల్లి గూడెం, నరసాపురం,తణుకు ఆర్టీసీ డిపోల నుంచి 46 ప్రత్యే క బస్సు లు ఏర్పాటు చేసారు. శ్రీశైలం క్షేత్రానికి శివ భక్తుల కోసం భీమవరం నుంచి 3, నరసాపురం నుంచి 2, తాడేపల్లిగూడెం నుంచి 2, తణుకు నుండి 2 బస్సులతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని, పట్టిసీమకు తణుకు వయా నిడదవోలు, పంగిడి, కాపవరం మీదు గా 5 బస్సులు , తాడేపల్లిగూ డెం , నల్లజర్ల, కొయ్య లగూ డెం మీదుగా 10 బస్సులు ఏర్పాటు చేశారు. పలుదేవాలయాల కూడలిగా పేరొందిన వీరం పాలేనికి తాడేపల్లిగూ డెంనుంచి 12, ఆచంటకు తాడేపల్లిగూడెం నుంచి పిప్పర, అత్తిలి, మార్టేరు మీదు గా 3,నరసాపురం నుంచి వయా పాలకొల్లు , మార్టేరు మీదుగా 2 ప్రత్యక బస్సులు నడుపుతున్నారు.
