సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో గునుపూడిలో పురాణ ప్రాశస్యం ఉన్న పంచారామ క్షేత్రం లో శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు ఈ నెల 3వ వారం నుండి నిర్వహిస్తున్న శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవములు(శివరాత్రి మహోత్సవములు) సందర్భములో తెప్పోత్సవం నిర్వహించు సోమగుండం చెరువు నకు నేడు, శనివారం దేవాలయ అర్చకులు వేదపండితులచే సంప్రొక్షన కార్యక్రమం నిర్వహించటమైనది. ఈ కార్యక్రమం నందు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీమతి కోడే విజయ లక్ష్మి , కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
