సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పవిత్ర పంచరామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు వచ్చే ఫిబ్రవరి 24వ తేదీ నుండి 28వ తేదీవరకు వైభవంగా నిర్వహించనున్న .శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణోత్స వములు (మహాశివరాత్రి కళ్యాణోత్సవములు) సందర్భముగా నేడు,శుక్రవారం ఉదయం గం.11-52ని.లకు పందిరిరాట వేసే కార్యక్రమం దేవాలయ అర్చకుల వేద మంత్రాల మద్య స్థానిక భక్తులు , దేవాలయ కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు దేవాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
