సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పవిత్ర పంచారామ క్షేత్రంగా భాసిల్లుతున్న గునుపూడి ప్రాంతంలోని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు రానున్న మహాశివరాత్రి వార్షిక కళ్యాణ మహోత్సవములు కు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ది 13- 2-2026 నుండి 17-2-2026వ తేదీ వరకు జరుగు కళ్యాణ మహోత్సవములు సందర్భంగా పందిరి రాట వేయుటకు ఆలయ పండితులు అర్చక స్వాములుశుభ ముహూర్తం నిర్ణయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో చింతలపాటి బంగార్రాజు, ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు ధర్మకర్తల మండల సభ్యులు బ్రహ్మ జోశ్యుల సత్యప్రసాద్ , బొచ్చా కృష్ణవేణి, పడమట లీల, పాల వెంకట రామకృష్ణ, సాయి నాగేంద్ర విజయలక్ష్మి కుమారి .యార్లగడ్డ రమేష్,బండి రమణ పొట్నూరి శ్యామ్ కుమార్ , పెద్దింటి జ్యోతిర్మయి కొప్పర్తి విజయ్ కుమార్, కందుకూరు సోమేశ్వరరావు, ఎక్స్ అఫీషియో మెంబరు మరియు ఆలయ ఇఓ రామకృషంరాజు, ఆలయ సిబ్బంది, గునుపూడి గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *