సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నెల రోజుల 62వ వార్షికోత్సవాలు ముగింపుగా నేడు, శుక్రవారం ఉదయం 7న్నర సమయానికిశ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో ఉన్న నిలువెత్తుశ్రీ అమ్మవారికి ఎదురుగా భారీ ఎత్తున పులిహోర , రంగురంగుల మిఠాయిలు, బూరెలు గారెలు,పంచభక్ష పరమణాలతో మహా నివేదనను వేదమంత్రోచ్చారణ హారతుల మధ్య కూటమి నేతల సమక్షంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో భూరి విరాళాలు ఇచ్చిన దాతలు కు , మీడియా ప్రతినిధులకు బదులుగా ఎక్కువ మంది భక్తులను లోపలకు అనుమతించడంతో, లోపల ఉన్నవారు, మహిళా భక్తులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మీడియా కవరేజ్ చెయ్యడానికి కూడా అవకాశం లేని విధంగా వందలమంది ఆలయంలో నిలిచిపోయారు. పోలీసులు కూడా వారితో పాటు కదలలేక లేక నలిగిపోవడం గమనార్హం. గతానికి బిన్నంగా వీఐపీ మార్గాన్ని విశాల్ మార్ట్ వైపుకు మార్చడం చాల మందికి దర్శనం లో గందరగోళం ఆలస్యం అయ్యింది. శ్రీ అమ్మవారికి మహానివేదన జరుగుతున్నప్పుడు అసలు ఏమి జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి. గత 25 ఏళ్లుగా ఎప్పుడు లేని పరిస్థితి నెలకొంది. అయితే 40 నిమిషుల తరవాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. శ్రీ అమ్మవారికి నైవేద్య సమర్పణ తదుపరి సంప్రదాయంగా ప్లాసిక్ సంచులలో ఇచ్చే కుంభ ప్రసాదం తీసుకొనే పనిలో నిర్వాకులు సమన్వయం లేక దేవాలయం లోపల భక్తులు ఉక్కిరిబిక్కిరి గురయ్యారు. అయితే జిల్లాలో మరెక్కడా జరుగని స్థాయిలో..ఉదయం 8 గంటల నుండి ఆలయ ఆవరణలో ఏర్పటు చేసిన భారీ చలువ పందిళ్ళలో వేలాది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం ప్రారంభమయింది. వేలాదిగా తరలి వస్తున్నా భక్తులతో నేటి మధ్యాహ్నం వన్ టౌన్ పట్టణ రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ మహా నివేదన కార్యక్రమంలో నీరుల్లి కూరగాయ వర్తకసంఘం , మరియు ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు,, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వన్ టౌన్ సీఐ నాగరాజు భారీ పోలీస్ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. నేటి సాయంత్రం వరకు ప్రశాంత వాతావరణంలో అన్న సమారాధన చక చక శ్రీ అమ్మ కృపతో నడుస్తుంది. పందిరిలో కాకపోయినా ఇంటిటికి వెళ్లిన ప్రసాదాలతో లక్ష మంది భక్తులకు శ్రీ మావుళ్ళమ్మ ప్రసాదం వితరణ పూర్తీ అవుతుంది.
