సిగ్మాతెలుగు డాట్, న్యూస్: తాజా వార్త సమాచారం ప్రకారం.. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్షానికి ఒక మహిళా బాధ పడిన ఘటన చోటు చేసుకుంది. అక్కడి వైద్యులు 3 నెలల క్రితం ఒక మహిళకు సిజేరియన్ చేసి కడుపులో వైద్యులు కత్తెర మరిచారు. అయితే ఇటీవల మహిళకు తీవ్ర స్థాయిలో కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మరల ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఎక్స్రే తీసిన వైద్యులు ఆమె కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని గుర్తించి ఆందోళనకు గురి అయ్యారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు విజయవాడకు తరలించగా.. అక్కడి వైద్యులు సర్జరీ చేసి కత్తెరను తొలగించారు. ఈతీవ్ర ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత వైద్యులు ఫై విచారణ ప్రారంభించారు.
