సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కర్నూలులో నేడు, శనివారం ఏర్పా టు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సభలో ..రాష్ట్రం లో పచ్చ దనం పెం చాలని ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. ఉద్యోగులు ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృ ష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచితబస్సు ప్రయాణ సదుయం కల్పిస్తామని సీఎం చం ద్రబాబు ప్రకటించారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం ‘రైతుబజార్లను 1999లో నేనే ఏర్పాటు చేశాను. రైతులకు గిట్టుబాటుధర రావాలి..వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్య మైన కూరగాయలు అందజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం .కర్నూలు సి క్యాంప్ రైతు బజారును రూ.6 కోట్లతో అబివృద్ధి చేస్తాం. అని ప్రకటించారు.
