సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాహుబలి సిరీస్ ప్రభంజనం.. RRR సినిమాకు ఆస్కార్ అవార్డులతో వరల్డ్ పేమస్ అయిన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రానున్న ‘ఎస్ఎస్ఎంబీ29’ కు సంబంధించి వస్తున్న ప్రతి వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. సుమారు 1000 కోట్లతో నిర్మించనున్న ఈ సినిమా కోసం ప్రపంచం ఎదురుచూస్తుంది మరి. అయితే రాజమౌళి తో పనిచేయాలంటే మహేష్ బాబు తక్కువలో తక్కువ రెండున్నర సంవత్సరాలు కేటాయించాలి. ఆయనతో సినిమా కమిట్ అయిన ఏ హీరో అయిన ఆ మాత్రం డేట్స్ ఇచ్చేయాల్సిందే. అయితే జక్కన్న ప్రస్తుతం మహేశ్‌తో ఇండియానా జోన్స్ తరహాలో భారీ యాక్షన్ అడ్వెంచర్ ప్లాన్ చేశారు. మరి ఈ కథకు ఫ్రాంచైజ్ సీక్వల్స్ కూడా ఉంటుందనే వార్తలుని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా గతంలోనే ధ్రువీకరించారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి మరో వార్త ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు తో మూడు పార్టులుగా రాజమౌళి తెరకెక్కించనున్నారని, ప్రస్తుతం ఆ సన్నాహాల్లో ఆయన ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో కీలక పాత్రలలో తెలుగు అగ్ర హీరోలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ తారలు, సాంకేతిక నిపుణులను భాగం చేయనున్నారని సమాచారం. ఇంటర్నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేసి రాజమౌళి ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంటే మహేష్ బాబు వరుసగా 3 సినిమాలు రాజమౌళి తోనే చేస్తారన్న మాట.. దీన్ని బట్టి చూస్తే. రానున్న ఎనిమిదేళ్లలో ఈ పార్టులు విడుదలవుతాయని, అభిమానులకు పండగేనని చెబుతున్నారు. మూడు పార్టులకు ఎనిమిదేళ్లు అంటే మహేశ్ సినీ జీవితం పాన్ వరల్డ్ స్టార్ గా మారుతున్నా నేపథ్యంలో రాజమోళి అతనిని 8 ఏళ్ళు లాక్ చేసేస్తాడా? వేచి చూద్దాం..
