సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్ హీరోగా ఎఫ్ 2 తో 150 కోట్ల కలెక్షన్స్ బంపర్ హిట్ తరువాత ఎఫ్ 3 తో 90 కోట్ల కలెక్షన్స్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కేవలం 5 నెలలో షూటింగ్ చేసి విడుదల చేసిన సరిలేరు నీకెవ్వరు’ 200 కోట్ల పైగా వసూళ్లు చేసి సంచలనం రేపాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి .. బాలయ్య తో తీసిన ‘భగవంత్‌ కేసరి’ ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక అనిల్‌ రావిపూడి. మహేశ్‌ బాబు కోసం కొత్తగా ఓ కథ సిద్దం చేశారని టాక్‌. మహేశ్‌ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఆ తరవాత.. రాజమౌళితో సినిమా చేయాలి. రాజమౌళితో సినిమా అంటే కనీసం రెండేళ్లు కేటాయించాల్సిందే. ప్రీ ప్రొడక్షన్‌ కోసం రాజమౌళి చాలా సమయం తీసుకొంటారు. ఈమధ్య గ్యాప్ లో రాజమౌళి అనుమతిస్తే,… కేవలం 3నెలల మహేష్ కాల్షీట్స్ ఇస్తే సినిమా మొదలు పెట్టాలని యోచన లో ఉన్నట్లు భావిస్తున్నారు. కుదరకపోతే .. రాజమౌళి సినిమా పూర్తయ్యాకే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుంది. సూపర్ స్టార్ మహేష్ మాత్రం తన అభిమానులకు సినిమా గ్యాప్ తెలియకుండా అనిల్ తో తదుపరి సినిమా కు సిద్దపడతారని ఫిల్మ్ వర్గాల టాక్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *