సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు నేడు, మంగళవారం సినీ హీరో మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భముగా జేపీ రోడ్డు లోని కావేరి ట్రావెల్స్ వద్ద సుమారు 300 మందికి అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. తమ హీరో మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు వలె ఇప్పటికే ఎన్నో సామజిక కార్యక్రమాలు చేస్తున్నారు, వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నారని, రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ గా మారతారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానులు బి హెఛ్ సుబ్బరాజు , గంట ప్రసాద్, బోనం ప్రసాద్, ఎస్ లక్ష్మి నరసింహ , రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
