సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) ఈసారి హాలీవుడ్ స్థాయి వేల కోట్ల రికార్డ్స్ బ్రద్దలు కొట్టే లక్ష్యంతో తెరకెక్కిస్తున్న’SSMB29′ సినిమా కు సంబంధించి భారతీయ సినీపరిశ్రమలో గతంలో ఎన్నడూ జరగని రీతిలో 25 కోట్ల పైగా ఖర్చుతో భారీ సెట్స్ నడుమ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15న నిర్వహించనున్న ఈవెంట్ పైనే అందరి చర్చ.. దీనిని అధికారికారికంగా రాజమౌళి తనయుడు కార్తికేయ నేడు, గురువారం పెట్టిన పోస్ట్ లో అధికారికంగా నిర్ధారించారు. అయితే ఈ ఈవెంట్ లో సినిమా టైటిల్ వదులుతార? లేక ఏకంగా టీజర్ ఇస్తారా? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమా ఈవెంట్ అన్ని ఛానెల్స్ లో కాకుండా కేవలం ‘జియో హాట్‌స్టార్’ (Jio Hotstar) ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుందంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తన ట్వీట్‌కు ఓటీటీ సంస్థ ఖాతాను కార్తికేయ ట్యాగ్ చేయడంతో దీనిపై క్లారిటీ వచ్చింది. మరి ఈ ఈవెంట్ కు ఇండిపెండెన్స్ డే, టైటానిక్, అవతార్ సిరీస్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ముఖ్య అతిధిగా? రానున్నారని సమాచారం..
