సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గత 15 రోజులుగా మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి. నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు కేజీకి వచ్చి రూ.230 నుంచి రూ.170కు చేరింది. భీమవరం రిటైల్ మార్కెట్ లో స్కిన్ లెస్ కేజీకి 200 కు అందుబాటులో ఉంది. అయితే, బ్రాయిలర్ కోడి లైవ్ ధర రూ100 లోపు పడిపోవడం తో మరియు గుడ్డు ధర కూడా పడిపోవడం తో గత జనవరి వరకు లాభాలలో ఉన్న ఫాల్ట్రీ రైతులు ప్రస్తుతం ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. పిల్ల రేటు, ఫీడ్ రేటు పెరిగిపోయిం ది. మరో పక్క ట్రాన్స్ పోర్టు చార్జీలు, లేబర్చార్జీలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలి అంటున్నారు. గుడ్ల విషయానికి వస్తే 100 కోడిగుడ్లు జనవరిలో రూ.570 ఉండగా, ప్రస్తుతం రూ.440 ఉంది. తాజగా రిటైల్లో మాత్రం వ్యాపారులు ఒకటి రూ.6 నుంచి రూ.6.50 వరకు అమ్ముతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *