సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి గురువారం నుండి మాఘ మాసం ప్రారంభం కావడం తో పెళ్లిసందడి మొదలయింది. ఈ నెల 26 నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలున్నాయి. వివాహాలతో పాటు నిశ్చయ తాంబూలాలు , గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలుకు పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్ప టికే ఏర్పాట్లు చేసుకున్నారు. శుభకార్యక్రమాలలో అగ్రస్థానంలో ఉండే, జిల్లా కేంద్రం భీమవరంలో ఇప్పటికే టాప్ 10 కల్యాణ మండపాలు , మధ్యతరహా, చిన్న తరహాగా ఉండే మరో 40 వరకు పంక్షన్ హాళ్లు కు బుకింగ్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. నెలన్నర పాటు ఎటు చుసిన శుభకార్యల సందడి. శుభలేఖలు మొదలుకొని కల్యాణ మండపాలు, పువ్వుల డెకరేషన్, లైటింగ్ సెట్టింగ్,వస్త్ర వ్యాపారులకు, కూరగాయలు, ఫుడ్ క్యాటరింగ్ వంటి శుభకార్యక్రమాల ఫై ఆధారపడి ఉన్న పలు వ్యాపార రంగాలకు ,. ఇంకా వీడియో గ్రాఫర్స్ ఫొటోగ్రాఫర్లు, మంగళ వాయిద్యాలు, టైలర్స్ , బంగారు ఆభరణ తయారీ దారులు,బ్యూ టీ పార్లర్లు, కూరగాయల సరఫరాదారులకు ఇప్పటికే డిమాండ్ పెరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో , భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లి గూడెం, నరసాపురం వాటి పరిసర ప్రాంతాలలో శుభకార్యక్రమాల జోష్ తో సుమారు జిల్లాలోని 300 పైగా కల్యాణ మండపాలలో సంబరాలతో వ్యాపార వర్గాలకు వందల కోట్ల వ్యాపారంతో ఈ మాఘమాసం ఆర్ధిక పరిపుష్టి ని చేకూర్చనుంది.
