సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వివాహ , గృహప్రవేశ తదితర శుభ ముహూర్తాలకు నెలవైన మాఘ మాసం నేటి శనివారం నుంచి ప్రారంభం అయ్యింది.. ఈ నెల నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు శుభకార్యాలకు అనుకూలం అని వేదపండితులు చెబుతున్నారు. ఈ నెల 14 వసంత పంచమి రోజు పెద్ద ముహూర్తం కావడంతో గోదావరి జిల్లాల వ్యా ప్తంగా వందల్లో పెళ్లిళ్లు ఉన్నాయి. అన్ని కల్యాణ మండపాలు ముందే బుకింగ్ అయ్యాయి. బ్యాండ్ మేళాలు, ఫొటో, వీడియో గ్రాఫర్లు, పూజారులు, హోటల్స్, క్యాటరింగ్, డెకరేటర్లు, ఈవెంట్ మేనేజర్లు బిజీగా మారనున్నారు. భీమవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా బంగారు, వస్త్ర, పూల దుకాణాలు సందడిగా మారనున్నాయి.ఇక బంధుమిత్రుల సందడి చెప్పేదేముంది. ఆర్థికంగా మార్కెట్ వేగం పుంజుకోనుంది.
