సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వీరవాసరం మండలం, మత్స్యపురి సొసైటీ బ్యాంక్ లో గత పాలకులు కంచె చేనును మేసినట్లుగా అవినీతికి పాల్పడ్డారని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు తీవ్ర విమర్శలు చేసారు. నేడు, శుక్రవారం ది మత్య్సపురి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా పుప్పాల వీరవెంకట నరసింహారావు, డైరెక్టర్లుగా కత్తుల పద్మారావు, చింతపల్లి వెంకటేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపడుతున్న పాలకవర్గ సభ్యులు ముళ్ళ కంచెపై కూర్చుంటున్నారని, గతంలో ఈ బ్యాంక్ చైర్మన్ రూ 2 కోట్లతో అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇది రైతుల బ్యాంక్ అని, వారి అభివృద్ధి కోసం జాగ్రత్తగా బ్యాంకు నడపాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గ్రంధి నుద్దేశించి ? పరోక్షంగా.. మత్స్యపురి గ్రామంపై కర్ర పట్టుకుని యుద్ధానికి వచ్చిన ఘనత భారత దేశ చరిత్రలో ఆ.. ఒక్క ఎమ్మెల్యేకే దక్కుతుందని, కక్షలు ఉంటే మాట్లాడుకోవాలే గాని కర్రలు పట్టుకుని రావడం సరికాదన్నారు. అందుకే ఆ ఎమ్మెల్యే ను ఈ గ్రామస్థులు ఓడించారని, అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారని అన్నారు. మన ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, అంతా ఐకమత్యంతో రైతులకు సేవా చేయాలన్నారు. కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, స్థానిక గ్రామస్తులు, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
