సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మాజీ మంత్రి, జేడీ-యూ మాజీ అధ్య క్షుడు శరద్ యాదవ్ (75) కన్నుమూశారు. ఆయన నివాసం లోనే గత గురువారం రాత్రి కుప్ప కూలి స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న ఆయన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారనీ, అప్ప టికి నాడి కూడా కొట్టుకోవడం లేదని గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రి తెలిపింది. ఆయన ప్రాణాలు కాపాడేందుకు అత్య వసర చికిత్స అందించిన ఫలితం దక్క లేదని ఒక ప్రకటనలో పేర్కొం ది. వేర్వేరు ప్రభుత్వాల్లో పలుమారులు కేంద్రమంత్రిగా ఆయన సేవలందించారు. ఏడుసార్లు లోక్ సభ , మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2003లో జేడీ-యూ ఆవిర్భవించాక తొలి జాతీయాధ్య క్షునిగా ఎన్నికైన ఆయన 2016 వరకు ఆ పదవిలో కొనసాగారు. మరల 2018లో లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని సొంతంగా ఏర్పా టు చేసుకుని, 2020 మార్చిలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో దానిని విలీనం చేశారు. ఆయన మృతికి ప్రధాని మోడీ తో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.
