సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ప్రధాని,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత. డాక్టర్ మన్మోహన్ సింగ్ (92)గత గురువారం రాత్రి కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న మాజీ ప్రధాని, రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆయన్ను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో చేర్చారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా ఉన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన భారతదేశంలో ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు. ఇది ప్రపంచ స్థాయిలో భారత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చెయ్యడానికి మన్మోహన్ తన మేధా సంపత్తిని వినియోగించారు. విదేశాలలో భారతీయ యువత ప్రముఖులుగా ఎదగడానికి భారత ఆర్థిక వ్యవస్థకు ఆధునిక నిర్మాత గా మన్మోహన్ సింగ్ చేసిన కృషి మరువలేనిది. ఆయన మృతి కి ప్రధాని మోడీ , సీఎం చంద్రబాబు తో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాప సందేశాలతో పాటు అంత్యక్రియలలో పాల్గొనడానికి ఢిల్లీ తరలి వస్తున్నారు. రాహుల్ గాంధీ,. సోనియా, ప్రియాంకతో కలిసి మన్మోహన్ సింగ్‌కు నివాళ్లులర్పించారు. కాగా, ప్రజల సందర్శనార్ధం ఢిల్లీలోని AICC కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. రాజ్‌ఘాట్ దగ్గర మన్మోహన్ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
