సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: రోజులు ఎప్పుడు ఒకేరకంగా ఉండవు.. పదవి లేని రాజకీయనేతల పరిస్థితి మరీను.. హైదెరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తానంటూ ప్రగతిభవన్‌కు వచ్చిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అవమానం జరిగింది. అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. సీఎం లేకపోతే.. మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ జేసీ అన్నారు. ముందస్తు అపాయింట్మెంట్ అయిన ఉండాలి.. లేదా ప్రగతి భవన్ నుంచి పెద్దలతో ఫోన్ అయినా చేయించాలని జేసీకి సెక్యురిటీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అయితే తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చేదేమిటని, తాను లోపలకు వెళతానని, సెక్యూరిటీతో జేసీ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ అపాయింట్‌మెంట్ లేనిదే తాము లోపలికి అనుమతించబోమని సెక్యూరిటీ నచ్చచెప్పడంతో చేసేదేమీలేక జేసీ దివాకర్ రెడ్డి వెనుదిరిగారు.
