సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ రాజకీయ ఉద్దండుడు .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ (70) కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నం లోని అపోలో ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ నేడు, ఆదివారం తుదిశ్వాస విడిచారు. వట్టి వసంతకుమార్ స్వస్థలం పశ్చి మగోదావరి జిల్లా పూళ్ల గ్రామం . ఉంగుటూరు నుంచి కాం గ్రెస్ తరఫున 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే గా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్రెడ్డి కేబినెట్లలో వసంతకుమార్ మంత్రిగా పని చేశారు. గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖల బాధ్యతలను ఆయన చాల సమర్ధవంతంగా నిర్వర్తించారు. 2014 ఎన్నికల తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నరు. ఆయన భౌతికకాయాన్ని విశాఖపట్నం నుంచి పుళ్ళ కు తీసుకొనిరానున్న దృష్ట్యా జిల్లాలోని ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *