సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు మిర్చి యార్డ్ కు వచ్చిన రైతులను పరామర్శించిన నేపథ్యంలో అక్కడ అసలు పోలీస్ భద్రతా లేకపోవడం వేలాది అభిమానుల సెల్ఫీల హడావిడిలో మధ్య జగన్ పలుమారులు నిలిచిపోయి నలిగిపోయి ఇబ్బందులు పడటం, అయినప్పటికీ ‘జగన్ బెదురూ లేకుండా’ జనం మధ్య నడిచి తన స్వంత బౌన్సర్లు సహకారం తో కారు వద్దకు వచ్చి అక్కడ నుండి మరల అభిమానులకు అభివాదం చెయ్యడం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు తో కలసి సీనియర్ నేత మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, బొత్స సత్యనారాయణ మీడియా తో మాట్లాడుతూ.. ఎన్నికల code అడ్డం పెట్టుకొని, ప్రతి పక్ష నేతను ఇలా సెక్యూరిటీ ఇవ్వని ప్రభుత్వాన్ని గతంలో ఎక్కడ చూడలేదు. మాజీ సీఎంగా అతనికి ఉన్న జెడ్ సెక్యూరిటీ ని కూడా అనుమతించకపోవడం దారుణం. గతంలో చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు పోలీస్ రక్షణ లేకుండా ఎప్పుడైనా వదిలేశామా? అని ప్రశ్నించారు. మరో వైపు దీనికి కౌంటర్ గా . కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ… జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే అని.. ప్రతిపక్ష నేత కాదన్నారు. జగన్‌కు ఇటీవల జైలు యాత్రలతో ఖైదీలు, వాళ్ళ కుటుంబ సభ్యులలో మంచి క్రేజ్ వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని..అన్ని తెలిసి డ్రామాలు ఆడుతున్న జగన్ పర్యటనకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ముందుగానే చెప్పారని మంత్రి బాలవీరాంజనేయస్వామి అన్నారు.
