సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నేతలుతో ఎటువంటి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా ఎవరు వచ్చిన వారితో సమావేశం అవుతూ ఉత్సహ పూర్వకంగా వారితో సమీక్షా చేస్తున్నారు. ఈనేపథ్యంలో సోమవారం తాడేపల్లి క్యాం ప్ కార్యాలయంలో వైఎస్ జగన్ పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. వారిలో ఎంపీ అభ్యర్థిగా ఓటమి చవిచూసిన భీమవరం కు చెందిన గూడూరి ఉమాబాల మరియు మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నా థ్, పుష్ప శ్రీవాణితో పాటు వంగా గీత, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, ఎంపీ మోపీదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే డా. సుధ తదితరులు ఉన్నారు. ఎన్నికలు ఫలితాలు,భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చిం చారు. కొత్త ప్రభుత్వం లో మరో కొద్దీ నెలల లోపే రాష్ట్ర ప్రజలు ఎన్నో మార్పులు చూస్తారని, వాస్తవాలు తెలుసుకొంటారని వైసీపీ నేతలు, కార్యకర్తలు కూటమి నేతలు చేస్తున్న దాడులతో అధైర్య పడనవసరం లేదని పార్టీ అన్ని రకాలుగా ఆదుకొంటుందని జగన్ భరోసా ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *