సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: 1984 లో ఎన్టీఆర్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఆయనను అధికారం నుండి దింపి నెల రోజులు పాటు అధికారంలో ఉన్న సమైక్య ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు( Nadendla Bhaskara Rao) ఆరోగ్య పరిస్థితి తాజగా అత్యంత ఆందోళన కరంగా మారింది. 90 ఏళ్ళ పైగా వయస్సులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 10 రోజులుగా ఆసుపత్రిలోనే మాజీ సీఎం చికిత్స పొందుతున్నారు.. వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడం, డయాలసిస్ కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని సమాచారం. ఆయన తనయుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ తరపున కూటమి ప్రభుత్వం లో పౌర సరఫరా మంత్రిగా పనిచేస్తున్నారు.
