సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనాలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి రాజానాద్ సింగ్ ఒక తాజా వార్త ప్రకటించారు. కింగ్‌డావోలో భారత్-చైనా రక్షణ మంత్రుల మధ్య అనేక కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా నేడు శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా కౌంటర్ అడ్మిరల్ డాంగ్ జున్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ సమయం నుంచి ఆగిపోయిన మానస సరోవర్ యాత్ర గురించి భారత రక్షణ మంత్రి ప్రస్తావించారు. అనంతరం యాత్ర పునఃప్రారంభంపై చైనా సానుకూలంగా స్పందించింది. దీంతో చర్చ అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. భారతీయులకు చైనా వైపు నుండి మానస సరోవర్ యాత్రకు అడ్డుంకులు ఇక లేవని ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు.
