సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించిన జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. కేవలం 500 మందికి మించి రైతులు జనం మించి హాజరు కాకూడదని పోలీస్ ఎన్నో ఆంక్షలు పెట్టిన, వందలాది వైసీపీ నేతలకు ముందస్తు నోటీసులు ఇచ్చిన లెక్కచేయక జగన్ కు దారి పొడవునా వేలాదిమంది తరలి వచ్చి రోడ్డులు కిక్కిరిసేలా తమ సంఘీభావం తెలిపారు. వైసీపీ నేతలను రైతులపై ఒక దశలో పోలీసులు లాఠి ఛార్జ్ చెయ్యడం దానిపై జగన్ ఎస్పీ ని తీవ్ర స్థాయిలో ఇదేమి పద్దతి అని ప్రశ్నించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మామిడి రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ మాట్లాడుతూ.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, చంద్రబాబు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదన్నారు ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారని. ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా ప్రస్తుతం కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా? అని జగన్ ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఆగం చేసిందని ఆరోపించారు. రైతుల్ని రౌడీషీటర్లతో పోల్చుతారా? రైతులపై రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో మాట్లాడేందుకు కేవలం 500 మంది మాత్రమే రావాలని ఆంక్షలు పెట్టడమేంటని ప్రశ్నించారు. జగన్ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
