సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత దశాబ్దంగా ప్రశాంతంగా ఉన్న ఏపీలో ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మరణించడం తదుపరి కృష్ణ, గోదావరి జిల్లాలో పోలిసుల తనిఖీలలో సుమారు 50 మంది మావోయిస్టులు అరెస్ట్ కావడం తో కోస్తా ఆంధ్ర లో ప్రజలు ఉలిక్కి పడ్డారు. తాజా గా మరో విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత బుధవారం ఉదయం తెల్లవారు జాము 5గంటలకు మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఆంధ్రా- ఒడిశా బోర్డర్ (ఏవోబీ) కమిటీ నేత మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ అలియాస్ బాబు అలియాస్ శివతోపాటు మరో ఆరుగురు ఉన్నారు. వీరంతా మావోయిస్టు పార్టీ మిలిటరీ చీఫ్ హిడ్మా దళ సభ్యులు. టెక్ శంకర్ ఈ దళంలో అత్యంత సీనియర్ నేత అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హిడ్మా, ఆయన భార్య రాజే సహా మొత్తం ఆరుగురు ఇదే ప్రాంతంలో మంగళవారం ఎన్‌కౌంటర్ అయిన విషయం తెలిసిందే. హిడ్మా దళం కోసం ‘ఆపరేషన్ సంభవ్’ పేరుతో గాలిస్తున్న కేంద్ర, ఆంధ్ర పోలీసు బృందాలు గత రెండు రోజుల్లో 13 మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశాయి.
