సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్ లో మార్కెట్లో సైతం కేజీ అల్లం 70 రూపాయలు 80 రూపాయలు మధ్య దొరికే అల్లం కు ఇటీవల ధర రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం భీమవరం బహిరంగ మార్కెట్లలో నాణ్యత బట్టి కిలో రూ.150 నుంచి రూ.170 ల ధర పలుకుతోంది. తూర్పు గోదావరి జిల్లా లో మరింత ఎక్కువ రేటు పలుకుతున్నట్లు తెలుస్తుంది.గత కొన్ని రోజులుగా హోల్‌సేల్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి.హోల్‌సేల్ మార్కెట్‌లో సోమవారం రూ.110-రూ.120లు పలికిన అల్లం బుధవారం ఒక్కసారిగా రూ.140లకు పెరిగిపోవడంతో ఆ ప్రభావం రిటైల్ మార్కెట్లలోనూ కనిపిస్తోంది. ప్రస్తుతం హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్‌లో పెద్ద వ్యాపారస్తులు మాత్రమే అల్లాన్ని పూర్తిస్థాయిలో విక్రయిస్తున్నారు. ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో రైతు బజార్లలోని వ్యాపారులు అనేకమంది అల్లం తేవడం తగ్గించారు. గిట్టుబాటు ఉండదనే కారణంతో అల్లం అమ్మడం ఆపేశారు. ఒకరిద్దరు స్వల్పంగా తెచ్చినా నాణ్యత ఉండడంలేదు. కప, వాత లక్షణాలను తగ్గించే ఆరోగ్య ప్రధాయినీ అల్లం ను చికెన్, మటన్ తదితర నాన్‌వెజ్ వంటకాల్లో బిర్యానీలు, పలావుల తయారీలోనూ అల్లం లేకపోతె ఎలా మరి? కొనాలి.. తప్పదు..
