సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో మరల శుభ ముహూర్తాల సీజన్ వస్తుండటంతో కళ్యాణమండపాలు, లైటింగ్ డెకరేషన్ , జ్యులరీ , వస్త్ర దుకాణాలకు, కేటరింగ్, వంటవాళ్లు, పూలు, పండ్ల స్వీట్స్ వ్యాపారులకు మరల సీజన్ అందుకోనుంది. ఇప్పటికేవరకు సంక్రాంతి వెళ్ళాక . ధనుర్మాసం.. మౌడ్యమితో శుభ ముహూర్తాలు లేక వివాహాలు జరగలేదు. అయితే ఈ నెల 19వ తేదీ నుంచి వరుస ముహూర్తాలతో పెళ్లి సందడి ప్రారంభం కానుంది. నాలుగు నెలల పాటు వరుస ముహూర్తాలతో వివాహ వేదికలు కళకళ లాడనున్నాయి. ఫిబ్రవరిలో 19, 20, 21, 24, 25, 26, మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12, ఏప్రిల్‌లో 15, 20, 21, 25, 26, 27, 28, 29, మేలో 1, 3, 5, 6, 7, 8, 13, 14, 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీల్లోను ముహూర్తాలు ఉన్నట్లు పండితులు ప్రకటించారు. ఇక పరోక్షముగా మార్కెట్ కూడా పుంజుకొని ఆర్ధిక లావాదేవీలు, అవకాశాలు పెరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *