సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో నిబంధనలు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న ఆరోపణలపై మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని పేర్కొంటూ చిట్ ఫండ్స్ చైర్మన్, ఈనాడు పత్రికల, సంస్థల గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజలపై సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 420(చీటింగ్) సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. అదేవిధంగా వివిధ జిల్లాల్లోని మార్గదర్శి కార్యాలయాల మేనేజర్లను ఈ కేసులో చేర్చారు. ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజ, ఏ3గా బి. శ్రీనివాసరావు ఇతరులను చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గత,శనివారం మరియు నేడు, ఆదివారం కూడా సీఐడీ అధికారులు మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వీఎ్‌సఎస్ కృష్ణారావు ఈ నెల 10న ఇచ్చిన రాత పూర్వక ఫిర్యాదు మేరకు ఏపీ ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లి్‌షమెంట్ యాక్ట్(ఏపీపీడీఎ్ఫఈఏ) 5 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. నెల క్రితం కూడా మార్గదర్శి కార్యాలయాల్లో సీఐడీ, జీఎస్టీ, ఎన్ఫోర్స్మెంట్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించటం గమనార్హం..
