సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ ఇటీవల దూకుడు మరింత పెంచింది. తాజా వార్త కధనాలు ప్రకారం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రామోజీరావు నివాసానికి నేడు, మంగళవారం ఏపీ సీఐడీ అధికారులు చేరుకున్నారు. కొద్దీ రోజుల విరామం తరువాత నేడు, మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఎండీ శైలజా కిరణ్ ను సీఐడీ అధికారులు మరోసారి విచారిస్తున్నారు. చందాదారుల నగదు ఎక్కడికి తరలించారన్న కోణం లో ఏపీ సీఐడీ దర్యాప్తు జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా రామోజీ గ్రూప్ కంపెనీలకు ఫండ్స్ మళ్లించినట్టు సీఐడీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చందాదారుల ప్రయోజనాలు రక్షించే కోణంలో మార్గదర్శి సంస్థకు చెందిన రూ. 798.50 కోట్ల విలువైన చరాస్తులును ఇప్పటికే సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శి ఛైర్మన్, ఎం డీ, ఫోర్మెన్, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్లు, చిట్స్ ద్వారా మార్గదర్శి సేకరిం చిన సొమ్ము మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు సేకరిస్తున్నారు. మార్గదర్శి కి ఏపీలో 1989 చిట్స్ గ్రూప్ లు, తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూపులు ఉన్నట్లు సీఐడీ ప్రకటించింది. కస్టమర్లకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లోసంస్థ లేదని సీఐడీ భావిస్తుంది.
