సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజా వార్త సమాచారం ప్రకారం.. సుప్రీం కోర్టులో నేడు, శుక్రవారం జరిగిన విచారణలో.. మార్గదర్శి చిట్ పండ్స్ కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. మార్గదర్శి సంస్థపై ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి సమంజసమైన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు మార్పు ఫై మార్గదర్శి పిటిషన్లను అనుమతించే ప్రసక్తే లేదని .. పైగా మార్గదర్శి ఫై ఏపీలో నమోదు అయిన కేసులపై విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని పేర్కొంది. . ఒకప్రక్క దర్యాప్తు జరుగుతున్నా క్రమం లోనే కేసును కొట్టివేస్తే పిటిషన్లన్నీ నిరర్ధకమే కదా ? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసుల విషయం లో ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్లను వేసుకోవాలని కోర్టు సూచనలు చేసింది.
