సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లోని పురపాలక,పట్టణాభివృద్ధిశాఖపై సమీక్షా సమావేశంలో ..నగరాల్లోపరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్లు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ , జగనన్న స్మా ర్ట్ టౌన్షిప్స్ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో వరుసగా భారీ వర్షాలు బాగా కురుస్తున్నాయని, మళ్లీ పట్టణాలు, నగరాల్లో పాడయిన రోడ్ల పరిస్థితిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సీజన్ ప్రారంభం కాగానే మళ్లీ వాటి రిపేర్ డ్రైవ్ చేపట్టాలని, మార్చి 31 నాటికి అన్ని రోడ్లనూ పూర్తిగా బాగు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ప్రతి మున్సిపాల్టీలో కూడా చెత్తను సేకరించి ఆ చెత్త ను శుద్ధిచేసే ప్రక్రియలో ఉన్న సౌకర్యాలు, వసతులు, మురుగునీటి శుద్ధి అం శాల్లో ప్రమాణాలు పాటించాలన్నారు. కృ ష్ణానది వరద ముంపు రాకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మించింది. గోడకు ఇటువైపున మురుగునీరుచేరకుండా తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఫై నిషేధం పూర్తిగా అమలు కావాలి. వాటి స్థానంలో కాటన్ గుడ్డతో లేదా చేనేత వస్త్రంతో ఫ్లెక్సీ వినియోగం అమలు కావడానికి జిల్లా కలెక్టర్లు ప్లెక్సీ వ్యాపారులతో సమావేశం అయ్యి వారికీ కావలసిన ఆర్ధిక ప్రభుత్వ సాయం ,ఇతర వనరుల సాయం ఫై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *